నటసింహం నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానులకు ఒక రోజు ముందే దిమ్మతిరిగిపోయే గిఫ్ట్ అందించారు. తన ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి అదిరిపోయే ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో అద్భుతంగా ఉందంటే.. చూసే ప్రతిఒక్కరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతలా ఈ పోస్టర్ని డిజైన్ చేయించాడు డైరెక్టర్ క్రిష్.
బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఆయన గెటప్ సూపర్బ్. వందలాదిమంది సైనికులు బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా.. రణరంగంలో పోరాడుతున్న ఉగ్రరూప శాతకర్ణి క్యారెక్టర్లో బాలయ్యని చూపించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. చూడబోతే.. క్రిష్ తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే తనలో దాగిన మరో విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. ‘శాతకర్ణి’ సినిమాలో తమ అభిమాన నటుడి గెటప్ ఎలా ఉండబోతుందని భావించిన నందమూరి ఫ్యాన్స్‌కి క్రిష్ బాలయ్య బర్త్‌డే కానుకగా అద్భుతమైన గిఫ్టునే అందించాడని చెప్పుకోవచ్చు.
loading...

