తర్వాత వచ్చిన దూకుడు సినిమాతో మరింత దూకుడు పెంచారు. గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో సోషల్ మెసేజ్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం నిన్న ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. ఇక సినిమా మొత్తం పెద్ద తారలతో నిండిపోయి సందడిగా ఉందట. మిక్కీజే మేయర్ సంగీతం పెద్దగా ఆదుకోలేక పోయిందని టాక్. ఏది ఏమైనా మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేస్తాడని ఊహించిన వారికి నిరాశే మిగిలిందట.
బ్రహ్మోత్సవం ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్లు :
నైజాం : 3.67 కోట్లు
సీడెడ్ : 1.50 కోట్లు
గుంటూరు : 1.90 కోట్లు
వెస్ట్ : 1.92 కోట్లు
ఈస్ట్ : 1.60 కోట్లు
కృష్ణ : 0.75 కోట్లు
నెల్లూరు : 0.45 కోట్లు
వైజాగ్ : 0.96 కోట్లు
మొత్తం : 12.75 కోట్లు
loading...



