అయితే ఏంటంటారా? అక్కడే ఉంది అసలైన విషయం. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను ఎక్కువగా సృష్టించి ఎక్కువ మంది యూజర్లను ఫ్రెండ్స్‌గా చేసుకుని వారికి అవసరం లేని స్పాం, అశ్లీల మెసేజ్‌లు పంపడం, ఆటోమేటిక్‌గా పోస్ట్‌లు వచ్చేలా చేయడం, యూజర్ల సమాచారం దొంగిలించడం ఇప్పుడు ఎక్కువైంది. ఈ తరహా గ్యాంగ్‌లు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫేస్బుక్ యూజర్లను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మధు షా (Madhu Shah) అనే ఓ మహిళ పేరిట ఫేస్బుక్లో అనేక నకిలీ అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు.
అసలు నిజంగా మధు షా అనే మహిళ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ, ఆ పేరిట ఓ మహిళ ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా పెట్టి కొంత మంది దుండగులు ఇప్పటికే దాదాపు 34 నకిలీ ఎఫ్బీ అకౌంట్లను క్రియేట్ చేశారు. ఇలా నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసే క్రమంలో సదరు మహిళ లొకేషన్లను కూడా డిఫరెంట్‌గా ఇచ్చారు. దీని వల్ల ఆ నకిలీ అకౌంట్లలో ఒక్కో అకౌంట్లో ఆ మహిళ లొకేషన్ ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని అకౌంట్లలోనూ ఒకే మహిళ ఫొటో దర్శనమిస్తుండడం కూడా మనం గమనించవచ్చు.
ఫేస్బుక్లో అకౌంట్ ఉన్న ప్రతి యూజర్‌కి ఈ నకిలీ అకౌంట్ల ద్వారా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు కూడా వెళ్లాయని, అధిక శాతం మంది ఆ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేసినట్టు గుర్తించారు. ఫేస్బుక్ సెర్చ్‌లో మధు షా పేరును టైప్ చేస్తే కింద వచ్చే రిజల్ట్స్‌లో ఈమె గురించి 69,826 మంది మాట్లాడుకుంటున్నట్టు కూడా వస్తోంది. దీన్ని బట్టి చూస్తే చాలు ఆ నకిలీ అకౌంట్ల బారిన ఎంత మంది పడ్డారో తెలుస్తుంది.
పైన చెప్పిన మహిళ మీకు కూడా ఫ్రెండ్ అయి ఉందేమో గమనించండి. ఒక వేళ మీరు తెలియకుండా ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేసి ఉంటే వెంటనే ఆ అకౌంట్‌ను అన్‌ఫ్రెండ్ చేసి ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ ఇవ్వండి. మీ ఫేస్బుక్ స్నేహితులకు కూడా ఈ నకిలీ అకౌంట్స్ గురించి చెప్పి, వారిని కూడా ఇలాగే చేయమనండి. పెద్ద ఎత్తున ఇలా ఫేస్‌బుక్‌కు అందరూ రిపోర్ట్ చేస్తే వారు కచ్చితంగా ఆయా అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
ఇప్పటికే కొంత మంది యూజర్లు ఈ నకిలీ అకౌంట్లపై ఫేస్బుక్ ఇండియాకు రిక్వెస్ట్‌లు పంపారు. ఫేస్బుక్ కూడా ఆ అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మీరు కూడా జాగ్రత్త వహించండి. లేదంటే మీ విలువైన సమాచారం తస్కరింపబడుతుంది. అసభ్యకరమైన పోస్ట్‌లు మీ ఫేస్బుక్ వాల్‌పై ప్రత్యక్షమవుతాయి. కాబట్టి బీకేర్ ఫుల్!
loading...


