ఉదయం నిద్రలేచినప్పటి నుండి మొదలు రాత్రి పడుకునే దాకా ప్రతి ఒక్కరు తమ సమయంలో సగానికి పైగా టైమ్ ను గడిపేది చేతిలోని స్మార్ట్ ఫోన్ తోనే.వాట్సప్, ఫేస్ బుక్, యుట్యూబ్, ట్విట్టర్,బుక్ మై షో, వెబ్ సర్చింగ్, న్యూస్, గాసిప్స్, ఇంటర్నెట్ గేమ్స్…ఇలా ప్రతి సెకనూ ఇంటర్నెట్ తోనే స్నేహం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రపంచం అడ్వాన్స్డ్ గా ఆలోచించి వెళ్తున్నప్పుడు మనం కూడా అదే బాటలో పయనించడం తప్పేంకాదు. సరే, ఇదంతా వదిలేయండి. ఇప్పుడు ఫన్నీగా ఓ సారి ఊహాలోకంలోకి వెళ్దాం. మన పురాణ పురుషుల చేతిలో స్మార్ట్ ఫోనూ దానికి ఓ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది? వారు ఎక్కువగా దేని కోసం సర్చ్ చేసేవారో ఫన్నీగా ఓ లుక్కేద్దాం.!
ఇంకో ముఖ్య విషయం ఇది ఎవరినీ బాధపెట్టడానికి కాదు, ఎవరినీ ఉద్దేశించి కాదు, మరెవరినీ కించపరచడానికి కాదు.
హనుమంతుడు:
హనుమంతుడు ఇది బజరంగ్ భాయి సెల్ఫీ అని ఫోటోలు తీసుకుంటూ ఎక్కువగా ఇన్ స్ట్రాగమ్ లో ఉండేవాడు. తన ఫొటోకు ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయో చెక్ చేసుకునేవాడు.
విఘ్నేశ్వరుడు:
మొదటి పూజలందుకునే ఆ విఘ్నేశ్వరుడు జొమాటోలో కుడుములు, ఉండ్రాల్లు వెతుకుతూ ఉంటాడు.
సూర్పనక:


