ప్రముఖ యోగ గురువు రాం దేవ్ బాబాకు ఇండియాలో ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందరో రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచీ సినిమా ప్రముఖుల వరకూ ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారే. యోగాసానాలు వేయడాన్ని ఓ ప్రొఫెషనల్‌గా మార్చేసిన ఆయన మనదేశంలో యోగాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
ఇది కూడా చదవండి:
మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని సూచించే సంకేతాలివే
ఇటీవల పతంజలి పేరుతో ఆయన స్టార్ట్ చేసి వ్యాపారం కూడా భారీ లాభాలు తెచ్చిపెడుతున్నట్టు తెలుస్తోంది. చివరకి ఉప్పు కావాలి అన్నా కూడా పతంజలి కి వెళ్ళమని చాలా మంది సలహాలు ఇస్తున్నారంటే ఆ వస్తువులకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో అర్థమవుతోంది. ఉప్పు నుంచి నూడిల్స్ దాకా పతంజలి లో అన్నీ దొరికేస్తున్నాయి. ఒకటేవిటి బిస్కెట్లూ, పప్పూ ఏదైనా అక్కడ పెద్ద లిస్టు ఉంది. పతంజలి వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందట.
ఇది కూడా చదవండి:
విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?
ఇక ఈ యేడాది టర్నోవర్ రూ.10 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న పతంజలి గ్రూప్ భారత్ నుంచి ఫారిన్ బ్రాండ్స్‌ను బయటకు పంపుతానని రాందేవ్ చేసిన శపథం నెరవేరేలా కనిపిస్తోందన్న విశ్లేషకులు అంటున్నారు. తన ఒంటిమీద కేవలం ఓ చాలీ చాలని ఎర్ర వస్ర్తాన్ని కప్పుకునే వ్యక్తి ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడా అని ఆలోచిస్తే షాక్ అవ్వకతప్పదు.
ఇది కూడా చదవండి:
loading...

