టైటిల్: సర్దార్ గబ్బర్‌సింగ్
జానర్: యాక్షన్ అండ్ కామెడీ థ్రిల్లర్
బ్యానర్: పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
డిస్ర్టిబ్యూషన్ రైట్స్: ఏరోస్ ఇంటర్నేషనల్స్
నటీనటులు: పవన్‌కళ్యాణ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సంజన, రాయ్‌లక్ష్మీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ విల్సన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
స్టోరీ: పవన్ కళ్యాణ్
నిర్మాతలు: శరత్‌మరార్
స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కేఎస్.రవీంద్ర(బాబి)
రన్ టైం:162 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్: యూ/ఏ
రిలీజ్ డేట్: 8 ఏప్రిల్, 2016
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ హీరోనే కాదు తెలుగు రాష్ర్టాల్లో ఓ పాపులర్ రాజకీయ నాయకుడు. 2013లో ఎన్నో కష్టాల మధ్య వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్లో రికార్డుల సునామీ సృష్టించాడు. ఆ సినిమా తర్వాత పవన్ జనసేన పార్టీ స్థాపించి ఓ పవర్ ఫుల్ పొలిటిషియన్‌గా మారాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ లాంటి పెద్ద పార్టీలకు మద్దతు ప్రకటించాడు. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితమే సోలోగా అత్తారింటికి దారేది సినిమాతో రూ.83 కోట్లు కొల్లగొట్టిన పవన్ ఇమేజ్ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది.
గతేడాది గోపాలా..గోపాలా సినిమాలో పవన్ కనిపించినా అందులో చిన్న రోల్ మాత్రమే చేయడంతో పవన్ ఫ్యాన్స్‌కు పెద్ద కిక్ ఇవ్వలేదు. అత్తారింటికి దారేది తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని పవన్ ఉగాది రోజున సోలోగా సర్దార్ గబ్బర్‌సింగ్‌గా థియేటర్లలోకి వస్తున్నాడు. రిలీజ్‌కు ముందే శాటిలైట్స్‌తో కలుపుకుని రూ.120 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్దార్ లెక్కకు మిక్కిలి అంచనాలతో వస్తున్నాడు. మరి సర్దార్ సినిమా స్టోరీ ఏంటి ? సినిమా ఎలా ఉండబోతుంది ? సినిమాపై ఉన్న అంచనాలేమిటో డెక్కన్ రిపోర్ట్.కామ్ ఫ్రీ రివ్యూలో ఓ లుక్కేద్దాం. ...NextPage
