హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్దరు దంపతులు ఒక్కటయ్యే శుభ ముహూర్తాన దేవతలు, దేవుళ్లు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులిరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది.
ఇక్కడ ఒకప్పుడు పార్వతీ దేవి శివున్ని వివాహమాడాలని తలంచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నాడట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్లయిన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్య కష్టాలు తొలగుతాయట. దీంతోపాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి.
దేవాలయంలో ఉన్న హవన్ కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మ దేవుడి సాక్షిగా పార్వతి, శివుడు ఒకటయ్యారట. ఇదే ప్రదేశాన్ని దంపతులు దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయట.......Next Page
