అనధికారిగా సమాచారం ప్రకారం సర్దార్ రన్ టైం 2.45 గంటలుగా ఉందని తెలుస్తోంది. సినిమా సెకండాఫ్‌లో `గోవింద్ సెలూన్`లో వచ్చే అంత్యాక్షరీ సంగీత్ ఎపిసోడ్, ఇంట్రడక్షన్ సీన్, రాయ్ లక్ష్మీతో తోబ…తోబ సాంగ్‌కు పవన్ వేసిన స్టెప్పులు, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు చాలా హైలెట్ కానున్నాయట.
ఇక చిన్న పిల్లాడిని విలన్స్ యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయే సన్నివేశాన్ని బాబి బాగా తీశాడని సమాచారం. వీటితోపాటు అబ్బూరి రవి డైలాగులు పవన్ వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసేలా ఉంటే, రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు హీరోయిజాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశాయని తెలుస్తోంది. ఇక సర్దార్ డైలాగులు కూడా కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
`పవరంటే ఒకరిచ్చేది కాదు.. బై బర్త్ రావాలి`.. `ఎవడైనా కొడితే ఒంట్లోంచి రక్తం వస్తుంది.. కానీ నేను కొడితే రక్తంతోపాటు భయం కూడా వస్తుంది` .. `నువ్వు చెప్పినట్టు రాసిన కేసు కొట్టేయడానికి నేను రబ్బర్ని కాదు… గబ్బర్‌ని` అన్న డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. టోటల్‌గా థియేటర్లలో పవన్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ కంటిన్యూగా విజిల్స్ వేస్తారట.
