పౌరాణికం,జానపదం,సాంఘీక చిత్రాల్లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చేయగల మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి రాకముందు తనకు బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ అంటే తెగ అభిమానంచే వారని తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం అని అన్నారు. అయితే వీరిద్దరి కన్నా ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం..అభిమానం అని అన్నారు. ఈ మద్య బాలీవుడ్ మీడియా కు ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ కు ఎవరూ సాటి రారు,ఆయన లాంటి నటుడు ఎవరూ లేరు అంటూ ఎన్టీఆర్ ని పొగిడి సంచలనం సృష్టించాడు పవన్. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ కోసం టీమ్ ఎంతో కష్టపడిందని సినిమాలో అద్భుతమైన సెట్టింగ్స్ ఉన్నాయని పూర్తి ఎంట్రటైన్ మెంట్ గా సినిమా వచ్చిందని ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.ఇక సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు పవన్
