సీనియర్ హీరోయిన్ నయనతార సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చిందన్న వార్తలు ఇండస్ర్టీలో వినిపిస్తున్నాయి. మెగాస్టార్ కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 150వ సినిమాలో నయనతారను హీరోయిన్గా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లే ఈ సినిమాలో చిరు పక్కన నయన అయితే కరెక్టుగా సెట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే నయన ఈ సినిమాలో నటించేందుకు చాలా కండీషన్లు పెట్టడంతో వినాయక్ అండ్ టీంకు కాస్త కాలిపోయిందట.
దీంతో చిరు పక్కన నయనకు బదులుగా అనుష్కను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇదే టైంలో చిరు సినిమాకు కండీషన్లు పెట్టిన నయనతార బాలయ్య వందో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8వ తేదీనే హీరోయిన్ ఎవరన్నది కూడా ప్రకటిస్తారని సమాచారం.
ఏదేమైనా సీనియర్ హీరోయిన్ నయనతార సీనియర్ హీరోలుగా ఉన్న చిరు సినిమాలో నటించేందుకు కండీషన్ల పేరు చెప్పి తప్పించుకుందని…అదే బాలయ్య సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తి చూపిందన్న రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. బాలయ్య సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉండడంతోనే ఆమె ఆ పాత్రను వదులుకోలేక చిరు సినిమా నుంచి కండీషన్ల పేరుతో తప్పుకుందని తెలుస్తోంది.
