నయనతారకు ఇండస్ర్టీలో పేరు రాకముందు ఎన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయో తెలియదు కాని… ఆమె కాస్తా పాపులర్ హీరోయిన్ అయ్యాక ముగ్గురు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపింది. శింబుతో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి తర్వాత పెటాకులైంది. తర్వాత కోలీవుడ్ హీరో ఆర్యతోను ఆమె లవ్ ఎఫైర్ నడిపింది. ఇక డ్యాన్స్ మాస్టర్ కం హీరో ప్రభుదేవా కోసం ఆమె చాలా త్యాగాలు చేసేసింది. నయన కోసం ప్రభుదేవా తన భార్యకు కూడా విడాకులు ఇచ్చేశాడు. మళ్లీ నయనకు ప్రభుతో గ్యాప్ రావడంతో ముచ్చటగా మూడోసారి ఆమె ప్రేమ బంధం పెటాకులైంది.
ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత హీరోయిన్గా ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోన్న ఆమె యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రేమలో హ్యాపీగా ఉందని అభిమానులు అనుకుంటుంటే.. ఇప్పుడు మరోసారి బ్రేకప్ న్యూస్ వినిపిస్తోంది. ”నానుం రౌడీ దాన్” సినిమా షూటింగ్ సమయంలో.. ఆ సినిమా డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది నయన. ఇద్దరూ హగ్ చేస్తున్న సెల్ఫీ ఒకటి తన వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ గా పెట్టడంతో అసలు విషయం అందరికీ తెలిసిపోయింది.
వీరి మధ్య బ్రేకప్ సెగలు కారణం ఏంటంటే నయనను పెళ్ళి చేసుకుందాం అని విఘ్నేష్ అంటుంటే.. ఇప్పుడే సడన్ గా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి కాబట్టి.. ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుందాం అని నయన్ చెప్పిందట. దానితో ఇద్దరి మధ్యనా గొడవలు వచ్చేశాయి అంటున్నారు. విఘ్నేష్‌కు ఆమె ఈ విషయంలో గ్యాప్ రావడంతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటోందని చెన్నై మీడియా టాక్. మరి ఈ ప్రేమ బంధం అయినా నిలుస్తుందో లేదా నయన కేరీర్లో నాలుగో ప్రేమ కూడా బ్రేకప్ అయినట్టేనేమో చూడాలి.

