హృతిక్ రోషన్ -కంగనా రనౌత్ మధ్య వివాదం కొనసాగుతోంది. గతంలో ప్రేమలో ఉన్న వీరు పెళ్లి వరకు వెళతారనుకుంటున్న టైంలో వీరి ప్రేమ సడెన్గా బ్రేకప్ అయ్యింది. హృతిక్ కంగనతో ప్రేమలో ఉన్న టైంలోనే తన చిరకాల స్నేహితురాలు, తన భార్య సుజానేఖాన్కు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ‘కైట్స్’ సినిమా షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత వీరి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో వీరు బద్ధ శత్రువులుగా మారిపోయారు.
కంగనా అనవసరంగా తన పేరును పదే పదే ప్రస్తావించి పరువు తీస్తుందని ఏకంగా పరువునష్టం దావా వేశాడు హృతిక్. కంగనా కూడా తగ్గలేదు. ఆమె కూడా రిటర్న్ దావా వేసింది. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం కోర్టులో ఉంది. అయితే ఇప్పుడు కంగన-హృతిక్ మధ్య వివాదం సరికొత్త టర్న్ తీసుకుంది. కంగనా తనకు మూడు వేల ఈమెయిల్స్ పంపి మెంటల్ టార్చర్ పెట్టిందని హృతిక్ ఆరోపించాడు. దీనిపై ఆధారాలు కూడా చూపించాడు. Next>>
loading...

