టాలీవుడ్ లో ఇప్పుడు పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ ’ మానియా పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాన్.. బాబీ దర్శకత్వంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు చోటు చేసుకుంది. ఇక పవన్ కళ్యాన్ చిత్రాలు ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎంట్రీ కాలేదు..ఫస్ట్ టైమ్ సర్ధార్ గబ్బర్ సింగ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు..మొన్నామద్య ‘సర్ధార్’ ఆడియో ఫంక్షన్ కి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే..దీంతో అన్నదమ్ముల మద్య విభేదాలు సమసిపోయాయని తెలిసిపోయింది. సో..ఇప్పుడు పవన్ కళ్యాన్ సినిమాలు, రాజకీయాలు రెండూ దిగ్విజయంగా చేసుకునే సౌలభ్యం ఉంది.
పవన్ ఇంటి ముందు సర్దార్ డైరెక్టర్ ధర్నా ఏంటని షాకవుతున్నారా… సర్దార్ డైరెక్టర్ బాబి పవన్ ఇంటి ముందు నిజంగానే ధర్నా చేశాడని ఫీల్ అవ్వకండి…ధర్నా చేస్తానని స్వయంగా చెప్పాడు. పవన్‌కళ్యాణ్ ప్రెస్టేజియస్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాబి ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పాడు. అదేంటి వీరిద్దరి మధ్య ఏం జరిగింది…అసలు బాబి పవన్ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేస్తానన్నాడని సందేహం రావడం సహజమే.
అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ సర్దార్ సినిమా షూటింగ్ టైంలో ఉండగా త్వరలోనే సినిమాకు గుడ్ బై చెప్పి ఫుల్ టైం పాలిటిక్స్‌లో బిజీగా ఉంటానని అన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఓ విలేకరి బాబిని ప్రశ్నిస్తే పవన్ సినిమాలు మానేస్తే తాను పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తానని … అసలు పవన్ సినిమాలు మానేస్తామంటే ఊరుకుంటామా అని చెప్పాడు ? అది విషయం. బాబి మాటలతో చాలా మంది పవన్ ఫ్యాన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. పవన్ సినిమాలు మానేస్తే తాము కూడా ఊరుకోం అని సోషల్ మీడియాలో బాబి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు.
