అతను వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట ఒక ఏనుగుకు 35 కిలోల కాఫీ గింజలు తినిపిస్తారు. ఏనుగు కాఫీ గింజలను జీర్ణం చేసుకున్న తరువాత పేడ వేస్తుంది. ఆ పేడలో ఒక కిలో కాఫీ గింజలు బయటపడుతాయి. ఆ గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండపెడతారు. తరువాత 19వ శతాబ్దానికి చెందిని ఫ్రెంచ్ కాఫీ మిషన్ లో గింజలు వేస్తారు.
ఎవరైనా ఐవరి కాఫీ ఆర్డర్ చేస్తే… ఆ మిషన్ తీసుకు వచ్చి పర్యాటకుల టేబుల్ మీదనే వేడివేడి కాఫీ తయారు చేసి ఇస్తారు. ఈ కాఫీ వగరు రుచితో ఉంటుంది. థాయ్లాండ్ లో పర్యాటకులను ఈ బ్లాక్ ఐవరి కాఫీ విపరీతంగా ఆకట్టుకునింది. ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఈ కాఫీ థాయ్లాండ్ తో పాటు, సింగపూర్, హాంకాంగ్ లో అందుబాటులో ఉంది. ఈ ప్రయోగాన్ని మొదట చిన్న పిల్లలు, సింహాలకు కాఫీ గింజలు తినిపించి గింజలు సేకరించానని, అయితే అది సక్సస్ కాలేదని వివరించాడు. ఏనుగుల పేడతో నా ప్రయోగం విజయవంతం అయ్యిందని బ్లేక్ డిన్ కిన్ చెప్పుకొస్తున్నాడు!
- మనిషి పుట్టింది కోతి నుండి కాదు, చేప నుండి
- అరటి పండు కన్నా, తొక్కే మేలట
- సన్నీ లియోన్ తో కాన్సర్ వస్తుందట! జాగ్రత్త!
