టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు-ప్రిన్స్ మహేష్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబోలో ఖలేజా, అతడు సినిమాలు వచ్చాయి. నిన్నటి వరకు త్రివిక్రమ్-మహేష్ బంధం చాలా స్ర్టాంగ్‌గా ఉండేది. అయితే తర్వాత ఏమైందో ఏమో కాని వీరి మధ్య గ్యాప్ వచ్చినట్టు ఇండస్ర్టీలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ మహేష్‌కు నాలుగైదు కథలు చెప్పగా వాటిని మనోడు రిజెక్ట్ చేశాడట. తర్వాత త్రివిక్రమ్ వేరే హీరోలకు ఆ కథలు చెప్పి ఓకే చేయించుకున్నాడట. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ బాగా ఎక్కువైనట్టు ఇండస్ర్టీ ఇన్నర్ టాక్?
ఈ నేపథ్యంలో వీరు సినిమాలు రెండు ఒకే రోజు పోటీ పడుతున్నాయి. శ్రీమంతుడు సినిమా తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా .. షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాలో కీలక నటీనటులతో క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నారు. ఈ నెల 20తో సినిమా కంప్లీట్ చేసి మే 6వ తేదీన బ్రహ్మోత్సవాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇక నితిన్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అ..ఆ సినిమా కూడా అదే రోజు వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 14నే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడి చివరకు మే 6 డేట్ ఫిక్స్ చేసుకుంది. నెల రోజుల క్రితమే అ..ఆను మే 6న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. మరి అదే డేట్‌కు కావాలని మహేష్ బ్రహ్మోత్సవం డేట్ ఫిక్స్ చేశారనేది ఇప్పుడు రకరకాల అనుమానాలకు తావిస్తోంది.
త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో నెల రోజుల క్రిందటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. మహేష్‌కు ఈ విషయం తెలియకుండా ఉండదు. మరి ఆ రోజే తన సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నట్టు…వీరి మధ్య గ్యాప్ ఎక్కువైందని…దీంతో త్రివిక్రమ్ నన్ను సంప్రదించకుండా ఉంటాడా అని మహేష్, మహేషే నన్ను సంప్రదించాలని త్రివిక్రమ్ పట్టుదలకు పోతున్నారన్న గుసగుసలు ఇండస్ర్టీలో వినిపిస్తున్నాయి. మరి ఫైనల్‌గా ఈ రెండు సినిమాలు అదే రోజున వస్తాయా లేదా వీరిలో ఎవరు వెనక్కు తగ్గుతారో చూడాలి.
