పక్కా కమర్షియల్ అంశాలతో కధను చెడగొట్టకుండా అయితే సినిమాను తెరకేక్కిస్తానని, ఆ నమ్మకం తనకు ఉందని, దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ అవుతుందని అన్నారు. ‘బాహుబలి’ని చూసిన కళ్ళతో ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను ప్రేక్షకులు చూడాలంటే ఇది మరింత విజువల్ గా ఉండాలని కోరుకుంటారని, అయితే కధాబలంతో ఉన్న ఈ సినిమా కధ ‘బాహుబలి’తో సరితూగేలా తెరకెక్కిస్తానని క్రిష్ చేసిన వ్యాఖ్యలకు నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, తన సినిమాలలో ఎప్పుడూ ఉండే సామజిక అంశాల ప్రస్తావన ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఈ సినిమా విడుదల అయిన తర్వాతైనా కులాల గొడవలు పోతాయని తాను ఆశిస్తున్నట్లుగా క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
“గౌతమిపుత్ర శాతకర్ణి” కధ ప్రజలకు తెలియకపోవడం ఒక అడ్వాంటేజ్ అని, తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుందని, దేశంలోని అనేక గణరాజ్యాల్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఏకం చేయడానికి కంకణం కట్టుకున్న గొప్ప ఆలోచనలు, మనసున్న మహా పురుషుడు మన తెలుగు వాడు కావడం విశేషమని, ఇది తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని క్రిష్ చెప్పిన సంగతులు సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుకునేలా చేస్తున్నాయి.
- రజినీకాంత్ బాధ్యతలు పవన్ చేతుల్లో
- Jr.N.T.R. ముందు నేను పనికిరాను అంటున్న పవన్
- బరువు తగ్గాలా..ఈ డ్రింక్ త్రై చెయ్యండి
- ఇలా సెక్స్ చేస్తే అక్కడ అదిరిపోవల్సిందే

