మన రామ్ గోపాల్ వర్మ ఈ మద్య ఖాళీ టైం దొరికితే మెగా ఫ్యామిలి హీరోల ఫై కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు..ఇటివల వర్మ , పవన్ ఫై విపరీతంగా కామెంట్స్ చేస్తూ న్యూస్ లో హాట్ టాపిక్ అవుతున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఇటివల జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో , ట్రైలర్ ఫై కామెంట్స్ చేసిన ఇతను, మరోసారి పవన్ ఫై తన నోరు కు పని చెప్పాడు వర్మ ..
రాజమౌళి + ప్రభాస్ + హాలీవుడ్ గ్రాఫిక్స్ + 300 రోజుల షూటింగ్ +150 కోట్ల బడ్జెట్ అన్ని కలిపి 100 రూపాయిలు అయితే, పవన్ కళ్యాణ్ ఒక్కడే 100 రూపాయిల తో సమానమని వర్మ కామెంట్ చేశాడు. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఫై ప్రతి రోజు వర్మ చేసే కామెంట్స్ తో మరింత క్రేజ్ వస్తుంది. మరి ఎన్ని అంచనాలను ఎలా అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.
