మ్యాక్ బ్రాజెల్ అనే వ్యక్తికి పిడుగుపడినప్పుడు వచ్చే శబ్దం కన్నా పెద్ద శబ్దంతో ఏదో ఒక ఉల్క లాంటి వస్తువు పడటం గమనించి రాస్వెల్ పోలిస్ అధికారికి విషయం అందించాడు. దీంతో పోలిస్ అధికారి కొంత మందితో ఒక టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపించి ఈ ఎగిరే పళ్లాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం కేవలం బెలూన్ పేలుడుగా మార్చి కవర్ చేయడానికి ప్రయత్నించింది.
వాటిపై పరిశోధన జరుపుతున్నట్టు;
దీంతో చాలా మంది ఆమెరికా ప్రభుత్వం ఈ ఎగిరే పళ్లాలను స్వాధీనం చేసుకుని వాటిపై పరిశోధన జరుపుతున్నట్టు అనుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఎగిరై పళ్లాలను స్వాధీనం చేసుకుని వాటి సాంకెతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసినట్టు, దాని ఫలితంగానే మైక్రోసర్కిట్, లేజర్, ఫైబర్ ఆప్టిక్, మైక్రోవేవ్ ఓవెన్, స్టార్ వార్ ఎస్డిఐ ఆయుధాలు వంటివి తయారు చేసింది’ అని తన పుస్తకం ‘ది డే ఆఫ్టర్ రాస్ వెల్’ అనే పుస్తకంలో ఫిలిప్ కార్సో అనే రచయిత వివరించాడు.
అయితే దీనికోసం ఆయనను విమర్శించిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఎగిరే పళ్లాలు తమకు కనిపించాయనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా రోజు వస్తుంటాయి. కొన్ని చిత్రాలు కూడా సంచలనాలు కలిగిస్తాయి. అవి ఉన్నాయన్న కథనాలను కాదనలేము….అలాగని ఉన్నాయి అని అనలేం. అయితే ఇలాంటి కథనాలు ఆసక్తిని కలిగిస్తాయన్నది మాత్రం ముమ్మాటికి నిజం
ఇక్కడికి సందర్శకులు కూడా వెళ్లే అవకాశం అప్పుడప్పుడూ కల్పిస్తారు.

