తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘సర్దార్ గబ్బర్ సింగ్ ’ మాటే..గత సంవత్సరం ‘బాహుబలి’ సినిమాకు వచ్చిన క్రేజ్ ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిందంటే అతిశయోక్తి లేదు. బాహుబలి చిత్రం కోసం రాజమౌళి సోషల్ నెట్ వర్క్ ను చాలా బాగా ఉపయోగించుకున్నాడు..ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ ఒక్క అప్ డేట్స్ సోషల్ నెట్ వర్క్ ద్వారా పంపించి హల్ చల్ సృష్టించారు. దీంతో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. ఈ మద్య సర్ధార్ ఆడియో వేడుకలో మెగాస్టార్ ఒక మాట మాట్లాడారు..తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ చిత్రం ఆ రికార్డ్స్ బద్దలు కొట్టాలి.అని.అంతే కాదు ముందు ముందు మంచి సినిమాలు వస్తూ ఆ రికార్డులు కూడ బద్దలు కొట్టాలి అన్నాడు.
మొత్తానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాలని ఆయన సారాంశం. దీనిపై రాజమౌళి స్పందిస్తూ..బాహుబలి సినిమా గతంలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా బాహుబలి రికార్డ్స్‌ను బద్ధలు కొట్టాలి. ఈ రికార్డ్స్‌ను ఇండస్ట్రీలోని మరో సినిమా బ్రేక్ చేయాలి అని కోరుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ టీం అందరికీ ఈ సినిమా అద్భుతంగా ఆడాలని తమ రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.తెలుగువారి ప్రతిభను, వారి స్థాయిని దేశవ్యాప్తంగా చాటాలని తాము కోరుకుంటున్నామంటూ జక్కన్న పవన్ అండ్ టీంకు విష్ చేశాడు. ఆయనతో పాటు, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, చిత్ర నిర్మాతలు కూడా సర్దార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
>> పవన్ సర్ధార్ లో 20నిమిషాల షాక్ !
>> ‘ముద్దు’ పెట్టుకునేప్పుడు ‘కళ్ళు’ ఎందుకు మూస్తారు?
