పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సర్దార్ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. బ్యాలెన్స్ ఉన్న ఓ పాటను పవన్-కాజల్‌పై షూట్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 లేదా 2వ తేదీల్లో సర్దార్ సెన్సార్ కంప్లీట్ చేసి ఈ సినిమాను ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్దార్ సినిమాలో నటించింనందుకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయంపై ఇండస్ర్టీలో హాట్ హాట్ డిస్కర్షన్లు జరుగుతున్నాయి.
సర్దార్‌ను పవన్ తన సన్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్‌మరార్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్దార్కు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. సర్దార్ సినిమా రైట్స్‌ను ఏరోస్ సంస్థ దక్కించుకోగా ఇప్పటికే అన్ని ఏరియాల్లోను బిజినెస్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
- సన్నె లియోన్ ఒక రాత్రికి 74లక్షలు
- రాజమౌళి NTR-సూర్య లతో మల్టీస్టారర్ మూవీ
- సన్నీ తో రొమాన్స్ కి నో చెప్పిన రానా
