అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే ఏ విషయంలోనైనా అతి పనికి రాదు. ప్రధానంగా ఇతరులతో హాస్యమాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఇక సొంత కుటుంబ సభ్యులతే ఇంకా జాగ్రత్త వహించాలి. హాస్యమాడే సందర్భంలో అది శృతి మించి అతిగా మారితే ఒక్కోసారి మొదటికే మోసం రావచ్చు. ఎదుటి వారి చేతుల్లో తన్నులు కూడా తినొచ్చు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ యువకుడికి ఎదురైంది.
తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి అని తండ్రితో హాస్యమాడబోయాడు. ఈ నేపథ్యంలోనే తన్నులు కూడా తిన్నాడు. ఈ తంతునంతా కెమెరాలో సొంతంగా రికార్డ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. హాస్యమాడబోతే అది కాస్తా చివరికి అతని తండ్రికి కోపం తెప్పించింది. దెబ్బలు తినేలా చేసింది. సో, హాస్యమాడండి, కానీ అది శృతి మించకుండా చూడండి.పైన తెలిపిన ఆ తండ్రీ కొడుకుల వీడియో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్గా దర్శనమిస్తోంది. ఆ వీడియోను మీరు కూడా చూడవచ్చు.
- పవన్ సర్ధార్ లో 20నిమిషాల షాక్ !
- తన 100వ సినిమాకి ఆస్కార్ రావడం ఖాయమంటున్న బాలయ్య
- ఆమెతో దాహం తీర్చుకున్న ఓ *** కధ !
- పాము కలలో కన్పిస్తే - ఏం జరుగుతుంది.....!!
