బన్నీ – బోయపాటి కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం “సరైనోడు”. ఇటీవల విడుదలైన టీజర్ తోనే అర్థమైపోయింది సరైనోడు ఎంత ఊర మాస్ నో. ఇప్పుడు.. ఆ ఊర మాస్ మోతమొదలైంది. సరైనోడు రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తాజాగా, సైనోడు కర్ణాటక రైట్స్ రూ. 7.5 కోట్లకు అమ్ముడు పోయాయి. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి కర్ణాటకలో మాంఛి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడది సరైనోడుకి బంపర్ రేటుని తెచ్చిపెట్టింది.
అయితే, ఇటీవలే పవన్ సర్థార్ – గబ్బర్ సింగ్ కర్ణాటక రైట్స్ రూ. 9కోట్లకు అమ్ముడు పోయాయి. సరైనోడు.. పవన్ ని రీచ్ కాకపోయినా.. మంచి రేట్ ని దక్కించుకోవడం విశేషం. బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్లు జతకట్టనున్నారు. సంగీతం థమన్. అల్లు అరవింద్ నిర్మాత.
- బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న సర్ధార్ !
- మహేష్ బ్రహ్మోత్సవం కొత్త టేజర్ !
- పవన్ కళ్యాణ్ 100 రూపాయిలుతో సమానమన్న వర్మ !
- నాన్నా నావల్ల ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందన్న కొడుక్కి తండ్రి ఇచ్చిన బహుమతి!
