ముంబై 26/11 దాడి కేసులో అప్రూవర్‌గా మారిన పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. అరేబియా, పాకిస్థాన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన్నట్లు డేవిడ్ హెడ్లీ తెలిపాడు. అరేబియాలో తనకు కొన్ని షాపులు కూడా ఉన్నట్లు కోర్టుకు వివరించాడు. ముంబై దాడుల కేసులో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీని ఇవాళ విచారిస్తున్నారు. తన వ్యక్తిగత అంశాలపై విచారణకు అభ్యంతరం తెలిపిన డేవిడ్ హెడ్లీ 2002 తర్వాత అరేబియా, పాకిస్థాన్ దేశాల్లో తాను పెట్టుబడులు పెట్టినట్లు డేవిడ్ హెడ్లీ తెలిపాడు. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీని విచారించారు.
ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారణ నిర్వహిస్తున్నారు. అంతేకాదు డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని కూడా నిర్వహించానని డేవిడ్ హెడ్లీ బుధవారం నాటి విచారణలో ఒప్పుకున్నాడు. భార్య షాజియా గిలానీ గురించి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించేందుకు హెడ్లీ నిరాకరించాడు. నకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసని అన్నాడు. పాక్‌కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని తెలిపాడు. అతనితో కలిసే 2006లో భారత్‌లోకి అక్రమ ఆయుధ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు.
1992 వరకు డ్రగ్స్ వ్వాపారం చేసినట్లు తెలిపాడు. 1988లో జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి 1998లో మళ్లీ జైలుకు వెళ్లేదాగా డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. అయితే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ లష్కర్ ఈ తోయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చినట్లు వెల్లడించాడు. పాక్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గత విచారణలో హెడ్లీ అంగీకరించిన విషయం తెలిసిందే.
- కళ్లు తెరవకుండానే ప్రపంచం చేత కన్నీళ్లు పెట్టించిన నలుగురు శిశువులు.
- పవన్ కళ్యాణ్ 100 రూపాయిలుతో సమానమన్న వర్మ !
- సర్ధార్ రికార్డులపై రాజమౌళి కామెంట్స్
- తన 100వ సినిమాకి ఆస్కార్ రావడం ఖాయమంటున్న బాలయ్య
- మహేష్ బ్రహ్మోత్సవం కొత్త టేజర్ !

