News and Entertainment

ఈ నెల 12 న ఆకాశంలో అద్భుతం-1

రాత్రిపూట ఆకాశంలో నేలరాలుతున్న తారాలా అనిపించే ఉల్కలు కనువిందు చేస్తాయి. మామూలుగా ఒక ఉల్క అలా నేలకూలితేనే ఆబ్బురంగా చూస్తాం. అలాంటివి పదులు.. వందల సంఖ్యలో రాలితే దాన్ని ఉల్కాపాతం అంటాం. అలాంటి ఉల్కాపాతాలు గతంలో చాలానే జరిగాయిగానీ..చెప్పారు. ఆ ఉల్కపాతంలోని ధూళికణాలు గంటకు 1,30,000 మైళ్లకు పైగా వేగంతో దూసుకొస్తూ..భూ వాతావరణంలో మండిపోతాయి. ఆ దృశ్యాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కల వేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. వెంటనే అవి వాతావరణంలోనే మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు.

అలాగే.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా రాబోతోంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకుంటోంది. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను పసిగట్టేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. విశ్వం నుంచి నిత్యం అనేకానేక గ్రహశకలాలు దూసుకొస్తూంటాయని.. కొన్ని భూమికి దగ్గరగా వెళతాయని మనందరికీ తెలుసు. వీటిని గమనించేందుకు నాసా ఆధ్వర్యంలోని ప్లానెటరీ డిఫెన్స్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీస్‌ పనిచేస్తోంది.

తాజాగా 2012 టీసీ4 అని పేరు పెట్టిన ఓ గ్రహశకలం భూమికి కేవలం 6,800 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. ఈ గ్రహశకలాన్ని తాము 2012లోనే గుర్తించామని అయితే అప్పట్లో ఇది వారం రోజుల పాటే పరిశీలనలకు అందుబాటులో ఉందని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్త విష్ణురెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.