News and Entertainment

ప్రభాస్ తో రాజమౌళి కొత్త మూవీ.. స్టోరీ లీక్.. కథేంటో తెలుసా?


‘చత్రపతి’ చిత్రతో ప్రభాస్‌ రేంజ్‌ను అమాంతం పెంచేసిన దర్శకుడు రాజమౌళి తాజాగా ‘బాహుబలి’ చిత్రంతో అదే ప్రభాస్‌ను బాలీవుడ్‌ స్టార్స్‌ పక్కన పెట్టడం జరిగింది. ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా అయిదు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ అయిదు సంవత్సరాల్లో ‘బాహుబలి’ చిత్రంలో మాత్రమే ప్రభాస్‌ నటించాడు. ఒక యువ హీరో ఇన్ని సంవత్సరాలు ఒక్క సినిమాకు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. కాని పది సినిమాలు చేసినంత గుర్తింపు ప్రభాస్‌కు ఒక్క ‘బాహుబలి’ చిత్రం వల్ల వచ్చిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే ప్రభాస్‌ మళ్లీ మళ్లీ కూడా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రాజమౌళి కూడా మరోసారి ప్రభాస్‌తో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తనపై నమ్మకంతో అయిదు సంవత్సరాల డేట్లు తనకోసం కేటాయించినందుకు గాను కృతజ్ఞతతో ప్రభాస్‌తో మరో సినిమాను చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ‘బాహుబలి’ సమయంలోనే ప్రభాస్‌ సుజీత్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ‘సాహో’ టైటిల్‌తో యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. అది కాకుండా ‘జిల్‌’ దర్శకుడు రాధకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కూడా ప్రభాస్‌ ఓకే చెప్పాడు. 2018లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఇంకా ఉంది