News and Entertainment

యంగ్ హీరో ఆకస్మిక మరణం..డిప్రెషన్ కు వెళ్ళిపోయిన తెలుగు హీరోయిన్


కన్నడ యువ హీరో ధ్రువ్ శర్మ శనివారం ఉదయం కుప్పకూలడంలో ఆయనను వెంటనే దవాఖానకు తరలించి చికిత్సను అందించారు. స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ధ్రువ్ ఆకస్మిక మృతి పట్ల ప్రియమణి, రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదాని తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

కన్నడ యువ హీరో ధ్రువ్ శర్మ ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన మరణానికి పలు అవయవాలు పనిచేయకపోవడం కారణమని వైద్యులు వెల్లడించారు. ధ్రువ్ శర్మ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ధ్రువ్ ఎలాంటి శారీరక రుగ్మతలతో బాధపడిన దాఖలాలు లేవని సన్నిహితులు అంటున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో అన్ని సినీ పరిశ్రమలతో ధ్రువ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. సీసీఎల్‌లో కర్నాటక బుల్డోజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

ధ్రువ్ శర్మ స్నేహాంజలి చిత్రంతో 2007లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. విమర్శకులు సైతం ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత నీనంద్రే ఇష్ట కనో, తిప్పాజీ సర్కిల్, బెంగళూరు 560023, లూటీ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ధ్రువ్ శర్మ పుట్టకతో మూగ, చెవిటితో బాధపడుతున్నారు. నటుడిగా మంచి పేరును సంపాదించుకొన్నారు. మూగ, చెవిటి లోపాలు ఉన్నప్పటికీ.. ఆయన చక్కటి లిప్ సింకింగ్‌తో తెర మీద రాణించారు. ధ్రువ్ శర్మ మూగ, చెవిటి అంటే ఎవరూ నమ్మరు అని సినీ ప్రముఖులు చెప్పుకొంటారు.