News and Entertainment

డ్రగ్స్ కేసులో రవితేజతో సమంతకు లింకేంటి..?


టాలీవుడ్ ను డ్రగ్స్ రాకెట్ ఓ ఊపు ఊపేసింది. అయితే ఇటివలే హీరో రవితేజను డ్రగ్స్ కేసులో విచారించిన విషయం తెలిసిందే. ఆ విచారణలో క్రియేటీవిటిటీ కోసం బ్యాంకాక్‌, గోవా వెళ్తాం తప్ప.. డ్రగ్స్‌ను వినియోగించడానికే అక్కడికి వెళ్తాం అనే దానిలో నిజం లేదని.. అదంతా వాస్తవం కాదని కొట్టిపారేశాడు. అయితే రవితేజను అడిగిన ప్రశ్నలలో ఎక్కువగా గతంలో బెల్జియంలో జరిగిన టుమారోల్యాండ్ ఫెస్టివల్ పైనే ఎక్కువగా సిట్ అధికారులు అడిగారని తెలుస్తోంది.

ఈ ఫెస్టివల్ కు అప్పట్లో సమంత కూడా వెళ్లడమే కాకుండా.. తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఆ ఫెస్టివల్ లో తాను హడావిడి చేసిన ఫోటోలను కూడా తన అభిమానులకు అప్పట్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి సమంత ఇంకా తాను నాగచైతన్యను ప్రేమిస్తున్నాను అంటూ పబ్లిక్ గా చెప్పలేదు. అయితే టుమారోల్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో సమంతతో పాటు రానా దగ్గుబాటి రెజీనా రకుల్ ప్రీత్ నితిన్ లతో పాటు రవితేజ కూడ అప్పట్లో హడావిడి చేశాడు.

అయితే ఆ పార్టీలో ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా అని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు అక్కడ తాము అంతా కేవలం రేవ్ పార్టీలో పాల్గొని మ్యూజిక్ ఎంజాయ్ చేశామే తప్పించి తాను ఎవరితోనూ ఎటువంటి డ్రగ్స్ సేవించలేదని రవితేజ చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఈ పార్టీకి సంబంధించిన ప్రస్తావన రావడంతో రవితేజతో పాటుగా ఆ పార్టీలో పాల్గొన్న అనేకమంది సెలెబ్రెటీల ప్రస్తావన రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.