News and Entertainment

రవితేజ అరెస్ట్ ఖాయం....ఎందుకంటే....


డ్రగ్స్‌ కేసులో మాస్‌ హీరో రవితేజ సిట్‌ నుండి నోటీసులు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే నోటీసులు అందుకున్న అందరు ఒక్కరొక్కరు చొప్పున విచారణకు హాజరు అవుతున్నారు.

కానీ ఇప్పటికే రవితేజ విచారణ డేట్ రెండు సార్లు మారింది. మరి 28న ఫిక్స్ అయినట్టేనా? టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వారిలో పెద్ద పేర్లు రెండే రెండు. ఒకరు పూరి జగన్నాథ్.. మరొకరు రవితేజ. అయితే మిగిలిన వారితో పోలిస్తే రవితేజ విషయంలో సిట్ అధికారులు గోప్యత పాటిస్తున్నారని.. ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రవితేజ విచారణ ఇప్పటికే పూర్తి కావల్సి ఉంది. అయితే రెండు సార్లు డేట్లు మారి 28న ఫిక్స్ అయిందని చెప్తున్నారు. పూరి కోసం చార్మి డ్రగ్స్ తెప్పించేదని.. అవి ముమైత్‌కు కూడా చేరేదని జిషాన్ అలీ సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడించినట్టు తెలుస్తోంది. నవదీప్, రవితేజతో పాటు చాలా మందికి కొకైన్ ఇచ్చానని జిషాన్ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బడాబాబులను వదిలేసి చిన్నవాళ్లను పట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేపు రవితేజ సిట్‌ ముందుకు వెళ్లబోతున్నాడు. సిట్‌ అధికారులు రవితేజను ప్రశ్నించేందుకు సిద్దం అయ్యారు.
నేడు ముమైత్‌ ఖాన్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు రేపు రవితేజను కాస్త సీరియస్‌గానే విచారించే అవకాశం ఉంది. ఇటీవల డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి రవితేజకు మేనేజర్‌ అని తెలుస్తోంది.

అందులో జీషన్ అలీ అనే వ్యక్తిని కస్టడీకి తీసుకొని సిట్ అధికారులు విచారించారు. జీషన్ విచారణలో రవితేజ, నవదీప్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే రవితేజ దర్శకుడు పూరి తదితరులకి డ్రగ్స్ అందచేశాడని చెప్పాడు జీషన్ అలీ...

రవితేజ మానేజర్ నుండి సేకరించిన వివరాల ప్రకారం రవితేజ డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు పలువురికి స్వయంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తాడని వెళ్లడైంది. మేనేజర్‌ సాయంతో రవితేజ డ్రగ్స్‌ వ్యాపారం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రవితేజ చిక్కులో ఇరుక్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు విచారణకు హాజరు అయ్యే రవితేజను అక్కడే అరెస్ట్‌ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మేనేజర్‌ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఇతరత్రా ఆధారాలను చూపించి రవితేజను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. ఏం చేయాలో పాలుపోక రెండు రోజులుగా షూటింగ్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రవితేజ తీవ్ర మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

ఇందులో నిజమెంతో అనేది సిట్ ముందు రవితేజ హాజరైన తర్వాత క్లారిటీ రానున్నది. ఇటీవలే మృతి చెందిన రవితేజ సోదరుడు భరత్ ను .. డ్రగ్స్ వాడుతున్నాడన్న కారణంగా రవితేజ కుటుంబం దూరం పెట్టింది. చివరకి ఆయన అంతిమ యాత్రకు కూడా హాజరుకాలేదు. అలాంటిది.. రవితేజ ఏకంగా డ్రగ్స్ సరఫరా చేశాడన్న న్యూస్.. ఆయన అభిమానులకి మింగుడు పడటం లేదు.