News and Entertainment

10 పాసైతే చాలు.. డిఫెన్స్ జాబ్.. శాలరీ 40 వేలు.. వెంటనే అప్లై చెయ్యండి


మీరు టెన్త్ పాస్ అయ్యారా... ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా...అది ప్రభుత్వ ఉద్యోగం అయితే బాగుంటుంది కదా.....ఇదిగోండి మీకోసం కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది.... ఆ వివరాలేంటో చూసేద్దాం రండి.........

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ట్రేడ్స్‌మెన్ విభాగాల్లోని టైలర్, గార్డెనర్, కాబ్లర్, వాటర్ క్యారియర్, కుక్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. వీరికి ఆరు మాసాలపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో స్టయిపెండ్ చెల్లించి, తర్వాత నెలకు రూ.40 నుంచి రూ.45 వేల వేతనం అందజేస్తారు.

కానిస్టేబుల్ లేదా ట్రేడ్స్‌మెన్303ఖాళీలు ఉన్నాయి....
దానిలో టైలర్ 19, గార్డెనర్ 38, కాబ్లర్ 27, వాటర్ క్యారియర్ 95, సఫాయి కర్మచారి 33, కుక్ 55, వాషర్ మెన్ 25,బార్బర్ 11 ఖాళీలు ఉన్నాయి..

దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే....పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. శారీరక ప్రమాణాలు... పురుషుల కనీస ఎత్తు 165 సెం.మీ. ఉండాలి. చాతీ 81 నుంచి 85 సెం.మీ. ఉండాలి. ఐటీబీపీఎఫ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

వయోపరిమితి, 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఫిజికల్ మెజర్‌మెంట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌కు పిలుస్తారు. ఇది పూర్తయిన తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు.

దరఖాస్తులు జులై 31 నుంచి స్వీకరిస్తారు.. మీ దరఖాస్తు సమర్పించడానికి చివరితేది సెప్టెంబరు 7....ఆలస్యం చేయకుండా మీ ప్రతిభను నిరీపించుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి...