News and Entertainment

‘చిరుత’కు ముందే రామ్‌చరణ్‌, శ్రియలు కలిసి నటించారు తెలుసా?


మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మొదటి చిత్రం ‘చిరుత’. ఆ చిత్రానికి ముందే ఈయన శ్రియతో ఎలా నటించాడా అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే వీరిద్దరు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం నటించారు. అయితే అది ఒక సినిమా కోసం మాత్రం కాదు. యాక్టింగ్‌ స్కూల్‌లో ప్రాక్టీస్‌ కోసం.
అవును చరణ్‌ హీరో కాక ముందు ముంబయి ఫిల్మ్‌ ఇన్సిట్యూట్‌లో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఒకసారి స్టార్‌ హీరోయిన్‌ అయిన శ్రియను ఆ స్కూల్‌ యాజమాన్యం ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగింది.

అప్పుడే ఒక సీన్‌ను ఇచ్చి రామ్‌ చరణ్‌ మరియు శ్రీయలతో చేయించారు నిర్వాహకులు. ఇప్పుడు ఆ సీన్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. చరణ్‌ సినిమాల్లోకి వచ్చే సమయానికి శ్రియ క్రేజ్‌ మెల్ల మెల్లగా తగ్గడంతో ఆమెతో కలిసి నటించే అవకాశం చరణ్‌కు రాలేదు. అయినా కూడా హీరో కాకుండానే చరణ్‌ ఆమెతో ఒక సీన్‌నులో అది కూడా ఒక లవ్‌ సీన్‌లో నటించడం జరిగింది.
ప్రస్తుతం పరిస్థితి చూస్తే రామ్‌ చరణ్‌ టాలీవుడ్‌లో ఒక బిగ్గెస్ట్‌ టాప్‌ స్టార్‌ హీరో. ఇక శ్రియ విషయానికి వస్తే పది సంవత్సరాలుగా మంచి అవకాశాలు లేక వచ్చిన సినిమాను చేస్తూ ఏదో కాలం వెళ్లబుచ్చుతుంది.