News and Entertainment

మార్చి31 తర్వాత జియో ఇచ్చే ఆఫర్స్ ఇవే!


టెలికం రంగంలోకి జియో రావడంతో ఇంట‌ర్నెట్ ఇప్పుడు అందరు వాడుతున్నారు. జియో వల్ల ఇతర టెలికం కంపెనీలు దెబ్బ తింటున్నాయి. ఇప్పటికే దేశ‌వ్యాప్తంగా చాలా మంది డేటా వినియోగ‌దారులు డేటా మీద డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం వేస్ట్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

వినియోగ‌దారులను ఆ రెంజ్ లో ఎడిక్ట్ చేసేసింది జియో. ఇప్పుడు వాడుతున్న ప్రతి స్మార్ట్ ఫోన్లో జియోను ఖచ్చితంగా వాడుతున్నారు. ఇక జియో ఉచిత వెల్ కం ఆఫ‌ర్ ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు మాత్ర‌మే ఉండనుంది. ఆ తర్వాత కూడా జియో డేటా వాడాలనుకుంటే.. కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా మంది అయితే జియో సిమ్ తీసి బ‌య‌ట ప‌డేద్దాం అనుకుంటారు. ఆరు నెల‌ల పాటు ఫ్రీగా జియో ప్రీ కాల్స్‌, డేటా వాడుకుని ఆ సిమ్ ప‌డేస్తే జియోకే క‌దా భారీ లాస్‌. ఈ భ‌యం జియోకు ఆల్రెడీ ప‌ట్టుకుంద‌ట‌.

ఎందుకంటే ఈ జియో సిమ్ ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌లో లాగా 2జీ, 3జీల‌లో పని చేయదు. తన వినియోగ‌దారులను నిలుపుకునేందుకు జియో మ‌రో అదిరిపోయే షాకింగ్ ప్లాన్ వేసింది. అయితే జియో మ‌ళ్లీ ఉచిత నెట్ ఇస్తుంద‌ని క‌ల‌లు క‌నొద్దు. ఇప్ప‌టికే జియోకు ఇన్ని అనుమ‌తులు ఇచ్చినందుకు ట్రాయ్‌మీద మొబైల్ నెట్ వ‌ర్క్ కంపెనీలు మండిప‌డుతున్నాయి. ఉచిత ఆఫర్ ని మళ్ళీ పొడిగించడం కష్టం. అందుకే జియో కేవ‌లం రూ.100 కే మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు 4జీ నెట్ సేవ‌ల‌ను అందించ‌నుంద‌ట‌. అంటే మార్చి త‌ర్వాత జియో వినియోగ‌దారులు మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు కేవ‌లం రూ.100 చెల్లిస్తే చాలు. ఈ ఆఫ‌ర్ అటు ఉచితం కాదు..ఇటు మ‌రీ అంత రేటూ కాదు అన్న‌ట్టుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మిగిలిన టెలికం కంపెనీలు జియో మీద మ‌ళ్లీ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసే అవకాశం లేదు.