News and Entertainment

సీతారాములు, లక్ష్మణుడు ఏ విధంగా చనిపోయారో మీకు తెలుసా..!?


రామాయణం గురించి అందరికి తెలుసు ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు. రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడం, రాముడు యుద్ధం చేసి రావణాసురుడుని చంపండం. సీతను తెచ్చుకోవడం అంత మనకు తెలుసు కానీ సీతారాములు, లక్ష్మణుడు ఏవిధంగా చనిపోయారో చాలా తక్కువ మందికి తెలుసు …..ఎందుకంటే చాలా మంది ప‌ద్మ పురాణం చదువకపోవడమే. అదే ప‌ద్మ పురాణంలో చాలా స్పష్టంగా సీతారాములు ఏవిధంగా చనిపోయారో తెలిపారు.

రాముడు సీతను లంక నుండి తీసుకువచ్చిన తర్వాత లోకం కోసం సీతకు అగ్నిప్ర‌వేశ ప‌రీక్ష పెడతాడు. ఈ కఠిన శిక్షలో నెగ్గుతుంది సీత. సీతను తీసుకువచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగి ప్రజలను చాలా బాగా చూసుకుంటుంటాడు. ఆ సమయంలో సీత మరో సారి అగ్ని పరీక్ష ఎదుర్కోవలసి  వస్తుంది. దానికి కారణం ఒక సాకలి, అతని మాటలకు బాధపడి సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాడు రాముడు. అలా కొద్దీ రోజుల తర్వాత మళ్ళీ రాజ్యానికి తీసుకువచ్చే సమయంలో సీతకు అగ్నిప్ర‌వేశ ప‌రీక్ష పెడుతాడు రాముడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక సీత తన తల్లి భూదేవిని తనను ఈ భూమి మీద ఉండకుండ నీ ఒడిలోకి తీసుకెళ్లమని వేడుకుంటుంది. భూదేవి ఒక్క‌సారిగా భూమి చీల్చుకుని పైకి వ‌చ్చి సీత‌ను తన ఒడిలోకి తీసుకోని వెలుతుంది. అలా సీత త‌న త‌నువు చాలిస్తుంది.  ఉత్త్తర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అల‌హాబాద్, వార‌ణాసి ప్రాంతాల‌ను క‌లుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేష‌న్ వ‌ద్ద సీతామ‌ర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒక‌ప్పుడు సీతాదేవి త‌న త‌ల్లి భూదేవితో క‌లిసి వెళ్లిపోయింద‌ని చెబుతారు.