News and Entertainment

రోజూ తలస్నానం చేస్తున్నారా.. మీకో షాకింగ్ న్యూస్.



వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామంది మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా?
* రెగ్యులర్‌గా తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ కోల్పోతే, తిరిగి పొందడం కష్టం అవుతుంది.
* ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేం. కాబట్టి రోజు మార్చి హెయిర్ బాత్ తీసుకోవచ్చు.
* జుట్టు రంగు దీర్ఘకాలం అలాగే కొనసాగాలంటే, తలస్నానం చేయకపోవడం మంచిది. రోజూ తలస్నానం
చేయకపోతే జుట్టు నేచురల్ కలర్ అలాగే ఉంటుంది.
* ఏ రోజైతే తలస్నానం చేయకుండా ఉండరో.. షాంపును వాడకపోవడం వల్ల జుట్టు చిక్కుపడకుండా, పొడిబారకుండా అందంగా కనబడుతారు.
* ప్రతి రోజూ రెగ్యులర్‌గా తలస్నానం చేయడం వల్ల జుట్టుకున్న తడి ఆర్పడానికి హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది. సో.. రెగ్యులర్ హెయిర్ బాత్‌ను తగ్గించడం మంచిది.