News and Entertainment

ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఇవి ఉంటే కచ్చితంగా సిరి సంపదలు మీ వెంటే..




ఇంటి ప్రధాన ద్వారం అనేది మన జీవితానికి అద్దం లాంటిది. అది ఎంత కళకళలాడితే అంత ధనం మనకు సమకూరడమే కాకుండా అదృష్టాన్ని,ఆత్మస్తైర్యాన్ని ఇస్తుంది. మంచి అయిన చెడు అయిన ప్రధాన ద్వారమే సూచిస్తుంది. మరి అలాంటి గుమ్మం లేదా ప్రధాన ద్వారం ఎదురుగా ఏమి ఉంటే మంచిదో చూద్దామా..

ప్రధాన ద్వారం నుండి ఇంటి లోపలకి..
ప్రధాన ద్వారం నుండి ఇంటి లోపలకి వచ్చేటప్పుడు మనకి మహాగణపతి ప్రతిమ లేదా ఫోటో ఉంటె ఆ ఇంటికి అన్ని శుభాలే, అదే కాకుండా కళ్ళ దిష్టి వినాయకుడి ప్రతిమ ఉంటే ఆ ఇంటికి నర ఘోష మరియు దిష్టి దోషాలు దరిచేరవు.

ప్రధాన ద్వారాన్ని చూస్తూ..
మనకి ఇప్పుడు ఎంతో ప్రాచుర్యంలో ఉన్న “లాఫింగ్ బుద్ధ ప్రధాన ద్వారాన్ని చూస్తూ ఉండటం లేదా ప్రధాన ద్వారం ఎదురుగా ఉండటం వల్ల మన ఇంటి నుండి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే చైనా కప్ప నోట్లో ఒక కాయిన్ పెట్టుకుని ఉన్నది కూడా మనం చూసాము, అయితే అది ప్రధాన ద్వారం నుండి లోపలకి వస్తున్నట్లుగా కొంచెం ఎత్తులో పెడితే ధనం బాగా చేకూరుతుంది. 

ప్రధాన ద్వారం ఎదురుగా..

ఒక గాజు గ్లాసులో నీరు నింపి దానిలో నిమ్మకాయ వేసి అది ప్రధాన ద్వారం ఎదురుగా ఉండే టేబుల్ లేదా మరి ఏదైనా స్టాండ్ మిద పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.