News and Entertainment

రాత్రి పడుకొనే ముందు చేయవలసిన 10 పనులు.. ఇవి చేస్తే..


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి సంరక్షణ అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఉదయం విశ్రాంతి అనుభూతితో లేచి ఆ రోజును పరిష్కరించటానికి సిద్దంగా ఉండాలి. ఈ విధంగా చేయాలంటే కొన్ని నిద్ర చిట్కాలను పాటించాలి. ఇప్పుడు చెప్పుతున్న ఈ మార్గాలను పాటించి మంచి నిద్రకు ప్రయత్నించండి.

1. స్నానం చేయటం
శరీర ఉష్ణోగ్రత అనేది నిద్రను నియంత్రించటంలో కీలకమైనదని నిద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు. రాత్రి పడుకొనే ముందు స్నానం చేయటం అనేది మంచి నిద్రకు సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వలన శక్తి సరఫరా అయ్యి నిద్ర నాణ్యతను మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

2. ధ్యానం
కొన్ని నిముషాల పాటు ధ్యానం చేస్తే మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాక ఈ ధ్యానం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి పడుకోవటానికి ముందు కొన్ని మంత్రాలను చెప్పటానికి ప్రయత్నించండి. దీని యొక్క ప్రయోజనం ఉదయం లేవగానే కనపడుతుంది.

3. జర్నల్
మనం ఒత్తిడికి గురి అయినప్పుడు ఏదైనా విషయాన్నీ రాస్తే భౌతికంగా మన మనస్సు క్లియర్ అవటానికి సహాయపడుతుందని ఒక పరిశోదనలో తెలిసింది. అంతేకాక మనస్సు బూస్టింగ్ కొరకు కూడా సహాయపడుతుంది. మంచి నిద్రకు కూడా ఈ విధంగా రాయటం అనేది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

4. నీటిని త్రాగటం
రాత్రి సమయంలో ఆల్కహాల్ త్రాగటం అనేది అనుకూలంగా ఉండదు. ఒకవేళ రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే నిద్రలో ఎక్కువగా మెలుకువ రావటం జరుగుతుందని ఒక పరిశోదనలో తెలిసింది. అదే ఒక గ్లాస్ మంచి నీరు త్రాగి ప్రయత్నించండి. అప్పుడు రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టటమే కాక, ఉదయం లేవగానే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

5. బ్రష్ చేయుట
ప్రతి రోజు రెండు సార్లు దంతాలకు బ్రష్ చేయాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సిఫార్స్ చేసింది. ఒకవేళ అలా చేయకపోతే బ్యాక్టీరియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాని పలితంగా చెడు శ్వాస మరియు నోరు అనారోగ్యానికి గురి అవుతుంది.