News and Entertainment

షాక్: సర్ధార్ రిలీజ్ అవ్వకముందే CDలు వచ్చేశాయి




టాలీవుడ్‌ను లీకుల వ్య‌వ‌హారం కుదిపేస్తోంది. స్టార్ హీరోలు న‌టించి భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాలు రిలీజ్‌కు ముందే లీక్ అయితే ఆ నిర్మాత‌ల‌తో పాటు బ‌య్య‌ర్ల గుండెలు గుబేల్ మంటున్నాయి. ఈ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై ఎక్క‌డ ప‌డుతుందో అని వారు భ‌య‌ప‌డిపోతున్నారు. గ‌తంలో అత్తారింటికి దారేది, బాహుబ‌లి సినిమాలు రిలీజ్‌కు ముందే కొన్ని సీన్లు లీక్ అవ్వ‌గా ఇక త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సీన్లు కూడా నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.



ఇదిలా ఉంటే కొద్ది గంటల్లో థియేట‌ర్ల‌లోకి రానున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ సినిమా సీడీలు అప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ‌ని తెలుస్తోంది. స‌ర్దార్ సినిమా సీడీలు బయటకు వచ్చాయన్న వార్తలు కడప జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌తో పోలీసులు హుటాహుటిన రియాక్ట్ కావటమే కాదు.. ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందించటం.. వారు రంగంలోకి దిగటం జరిగాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని పొద్దుటూరులోని సీడీ షాపుల మీద పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు.

సర్దార్ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ కొందరు రెండు రోజుల క్రితం ..NextPage