News and Entertainment

100 కోట్లున్నోడు మొగుడుగా కావాలన్న అమ్మాయికి-1


ప్రియమైన పూజా,
నీ పోస్టు చాలా ఆసక్తిగా ఉంది. ఇలా ప్రశ్నించే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ గా నీకు సమాధానం చెబుతున్నా.... నా వార్షికాదాయం రూ. 100 కోట్ల పైనే. కాని నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృథా చేసుకోదలుచుకోలేదు. ఇక నీ విషయానికి వస్తే... నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే నువ్వు అందాన్ని ఇస్తే, పుచ్చుకునే వాడు నిన్ను పొందేందుకు డబ్బు చెల్లించాలి. దాని వల్ల అతనికి ఎలాంటి లాభం లేదు.

ఎందుకంటే ఇక్కడో ప్రధానమైన సమస్య ఏంటంటే, నీ అందం రోజురోజుకూ తరిగిపోతుంది. అతని ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది.

ఇక ఆర్థిక కోణంలో పరిశీలిస్తే, అతడిది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే, అది మంచి ఆలోచన ఎంతమాత్రమూ కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి.

ఎవరికైనా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందంటే, అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన మానెయ్. నీకు నువ్వే రూ. 100 కోట్ల ఎలా సంపాదించాలో ఆలోచించు, ప్రయత్నించు. అప్పుడు నీ కోరిక నువ్వే తీర్చుకోవచ్చు. నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.
- ముఖేష్ అంబానీ