News and Entertainment

కేంద్రం వార్నింగ్.. ఆగస్టు 31 ఆఖరు తేది.. లేదంటే చాలా నష్టపోతారు..!

loading...

తాజాగా ఆదాయ పన్ను మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. గతం లో పాన్ కార్డ్ సహాయంతో GST ప్రభావాన్ని అంచనా వేసిన IT శాఖ, ప్రతి ఒక్కరు ఆధార్ నంబరును పాన్ కార్డ్ తో జులై1 లోగా లింక్ చేయమని కోరింది....కానీ దీనిపై క్లారిటీ లేనందున చాలా మంది దీనిపై దృష్టి పెట్టలేదు.....ఇక తాజాగా ఆగస్టు 31వ తేదీలోపు ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ ద్వారా సోమవారం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపల పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. అంతేకాదు ఆగస్టు 31వ తేదీలోపు ఆధార్‌నెంబర్‌తో లింక్‌ చేయని ఐట రిటర్న్స్‌ కూడా చెల్లవని స్పష్టం చేసింది.
ఇప్పుడు ఈ లింకింగ్‌ ప్రక్రియ ఎలాగో ఒకసారి చూద్దాం.
ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే వారయితే అంటే ఇన్ క‌మ్ టాక్స్ క‌ట్టే వాళ్లు అయితే..మీరు ఇదివ‌ర‌కే రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్ అయితే.. www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్ లాగిన్ హియ‌ర్. అనే ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి.. యూజ‌ర్ ఐడి, పాస్ వ‌ర్డ్ తోపాటు అక్కక డిస్‌ప్లే అయ్యే క్యాప్చర్ కోడ్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ తో పాన్ ను లింక్ చేసే ఫామ్ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, పేరు ఆధార్ లో ఉన్న విధంగా ఎంట‌ర్ చేయాలి. ఈ ప్రాసెస్‌ పూర‍్తయిన వెంటనే .. స‌క్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అనే మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తుంది..

ఒక‌వేళ మీరు రిజిస్ట‌ర్డ్ యూజ‌ర్స్ కాక‌పోతే... www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో New to e-filling Register yourself అనే ఆప్ష‌న్ ను క్లిక్ చేయండి. మీ వివ‌రాలు ఎంట‌ర్ చేయండి. మీకు యూజ‌ర్ ఐడి, పాస్ వ‌ర్డ్ మీ రిజిస్ట‌ర్డ్ మెయిల్ ఐడీకి వ‌స్తుంది. త‌ర్వాత ఆ వివ‌రాల‌తో లాగిన్ అయి.. ఆధార్, పాన్ ను లింక్ చేయండి.

ఇక ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌ని వారికి ఈ ప్రక్రియ మరింత సులువు..మొత్తం కేవలం 60 సెకన్లలో పూర్తవుతుంది. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో కి వెళ్లాలి. ఆధార్‌ లింకింగ్‌ విత్‌ పాన్‌ మేడ్‌సింపుల్‌..క్లిక్ హియ‌ర్ అనే ఆప్ష‌న్ ను క్లిక్ చేయాలి.. త‌ర్వాత మూడు కాలమ్స్‌తో ఉన్న టేబుల్‌ ఓపెన్‌ అవుతుంది. దాంట్లో వున్న ప్రకారం నిర్దేశిత కాలమ్‌ లో పాన్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, పేరు ఆధార్ లో ఉన్న విధంగా ఎంట‌ర్ చేయాలి. అంతే... స్క్రీన్ పై స‌క్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్‌ రాకపోతే మనం ఎంట్రీ చేసిన వివరాలను మళ్లీ ఒకసారి సరి చూసుకుంటే..చాలు. ఆధార్ ను పాన్ తో లింక్ పూర్తవుతుంది.

ఇక మరొక చక్కటి అవకాశం ఇంట్లో కూర్చొనే తాపీగా దీనిని చాలా సులువుగా అనుసందానించుకోవచ్చు.ఒకే ఒక్క మెస్సేజ్ తో మీ పని పూర్తయిపోతుంది. ఆ ప్రక్ర్దియ ఎలాగో ఇప్పుడు చూద్దాం...

ఆదాయ పన్ను శాఖ నేరుగా ఇంట్లోనే ఉండి SMS తో ఈ అనుసంధానాన్ని చేసుకునేలా వెసులుబాటు కలిపించింది. ఇంతకి sms ఎలా యేమని పంపాలంటే, మీ మొబైల్ లో 'UIDPAN'అని టైప్ చేసి space ఇచ్చి "AADHAR NUMBER" ని టైపు చేసి మల్లి SPACE ఇచ్చి మీ PAN నెంబర్ ను ఎంటర్ చేయండి. తరువాత ఈ మెస్సేజ్ ని 567678 లేదా 56161 అనే నెంబర్ కి మెస్సేజ్ సెండ్ చేయండి. అంతే సింపుల్ మీ పని అయినట్లే, పాన్,ఆధార్ లింక్ కన్ఫర్మేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ కి ఒక కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇలా కాదనుకుంటే ఆదాయపన్ను శాఖ కు చెందిన e-Filling అనే అఫీషియల్ వెబ్సైటు లో కూడా ఈ లింక్ ప్రక్రియను కొనసాగించవచ్చు.

కాగా 2017వరకు ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉంటారో, వారంతా సెక్షన్ 139ఏఏ సబ్-సెక్షన్2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్ను పాన్ కార్డులకు లింక్ చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. మరోవైపు ఆదాయ పన్ను దాఖలుకు ఈ నెల 31 తో ముగియనున్న గడువును ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.