News and Entertainment

ఆడవాళ్ళకి కావాల్సింది మగాడా? మొగుడా? సర్వేలో చెప్పిన నిజాలు

loading...

మానవ సంబంధాల్లో మార్పులు సహజం. ఒక దశ నుంచి మరో దశకు ప్రయాణించే క్రమాన మార్పులు అనివార్యం. అయితే మంచి దిశగా జరిగే మార్పును స్వాగతించడం మానవనైజం. ఇందుకు విరుద్ధంగా నెలకొనే పరిణామాలు ఆందోళనకరం. ఇప్పుడు మానవ సంబంధాల్లో నెలకొంటున్న విపరిణామాలు కుటుంబవ్యవస్థకు పెనుసవాల్‌గా నిలిచాయి.

వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ రెండింటినీ అత్యున్నతమైన వ్యవస్థలుగా సమాజం పరిగణించింది. వీటిలోని అమానవీయ, ఛాందస విధానాలు మారాలని ఆశించింది. ఈ రెండు వ్యవస్థల్లోనూ ప్రజాస్వామ్య రీతి నెలకొనడం కోసం మనుషులు పోరాడుతూ వచ్చారు. అంతేతప్ప ఈ రెండు వ్యవస్థలు సమసిపోవాలని అభిలషించలేదు. ఎందుకంటే లోపాలున్నప్పటికీ ఈ రెండింటినీ మానవ సంబంధాల ఉన్నతికి దోహదపడే వ్యవస్థలుగా భావించింది సమాజం.

నాగరిక సమాజంలో బ్రతుకుతున్న మనిషి నైజంలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకి విలువ ఇచ్చే ప్రజలు ఇప్పుడు కలిసి ఉండటానికి కుటుంబం అవసరం లేదు కదా అనే స్థాయికి ఎదిగిపోయారు. పెళ్లి అనే బంధంతో ఒకటయ్యే స్త్రీ, పురుషులు కేవలం ఆ సుఖాల కోసం మెళ్ళో మూడు ముళ్ళు వేసుకోవాలా అనేంతగా ఆలోచన పెంచుకున్నారు.