News and Entertainment

బిగ్ బాసా మిడ్నైట్ మసాలా?.. అక్రమ సంబంధాల గోలేమిటిరా నాయనో..


ఎట్టకేలకు బిగ్ బాస్ షో 16 రోజులు పూర్తి చేసుకుంది....కానీ చూసేవారికి ఎక్కడో కొంత ఎంటర్టెయిన్ మెంట్ తగ్గినట్టు అనిపిస్తోంది దేన్నీ ఫుల్ ఫైల్ చేయడానికి అన్నట్టు వినియోగదారులు, వసూలుదారులు అనే టాస్క్ ని ఇచ్చారు .... ఇచ్చింది ఒకటి వాళ్ళు అర్ధం చేసుకున్నది ఒకటి అందులో వారు కలుపుకున్న సంబందాలు చూస్తే కొంత రోత పుట్టించే విధంగా ఉంది......హరితేజ పనిమనిషి గెటప్ లో ఉంటూనే ధనరాజ్ ని గోపి గోపి అనటం....ఆల్రెడీ ధనరాజ్ ముమైత్ ఖాన్ జోడిగా ఉండటం....అలాగే కొత్తగా వచ్చిన దీక్షా ప్రిన్స్ కోసమే వచ్చిందా అన్నట్టు ఆక్ట్ చేయడం పైగా దీక్షా కూడా తెగ ఫీలవ్వడం కాస్త వెగటు గానే అనిపించాయి...
అలాగే శివబాలాజీ హరితేజను వెకిలి చేష్టలతో డబల్ మీనింగ్ డైలాగులతో పిలవడం మాట్లాడటం అనే విషయాలు కాస్త మొహం తిప్పుకునేట్టుగానే అనిపించాయి....


ముందు ప్రిన్స్ కి అర్చన కి మధ్య లవ్ ఎఫ్ఫైర్ నడిచింది,ఇక దీక్షా వచ్చిన తరువాత ప్రిన్స్ ఆమెతో జత కట్టడం ప్రిన్స్ ని అర్చన మరిది అనడం అతను వదినా అందం కొంచం చూడటానికి అసహ్యంగానే అనిపించిది...

ఇక ముమైత్ అయితే కొంత వరకూ వీరంగం సృష్టించిందనే చెప్పాలి అర్చనా డబ్బు ఖర్చు అవుతుందని భోజనం మానేయడం ఆ విశయాన్నీ ప్రిన్స్ ముమైత్ కి చెప్పడం...అది నాకు ఎందుకు చేపుతున్నావ్ అది ఆమె ఇష్టం అని బస్సున పైకి లేచింది ముమైత్....ఇక వంటింట్లో మహేష్ కత్తిని ముమైత్ అయితే ఏకంగా అనవసరంగా అతనిపై ఉన్న నిజాల్ని తిట్లుగా మర్చి తిట్టేసింది పాపం మహేష్ ఎమనకుండానే అతని పని అతను చేసుకున్నాడు....

ఇక నటనపరంగా శివబాలాజీ, హరితేజ లేకుండా ఆ కాస్తంతైనా అడల్డ్ కామెడీ పండేది కాదేమో. మౌనవ్రతం పట్టిన కల్పన ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్టు కనిపించింది. అశోకవనంలో సీతలా కనిపించిన కల్పన ఇప్పడిప్పుడే రిలీఫ్‌గా కనిపిస్తున్నది. కల్పన కోలుకుంటుందా గత కొద్దిరోజులుగా వెంటాడిన అనుమానం పటాపంచలైపోయింది. ఇంకా ఉంది