News and Entertainment

బాలయ్య మళ్లీ కొట్టాడు.. ఇంకా నీకు బుద్ది రాదా?


నందమూరి బాలకృష్ణ అభిమానులను తన సహాయకులను అప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు. ఆ విషయం ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. ఇటీవల కూడా ఒక అభిమాని ఫొటో తీసుకునేందుకు దగ్గరగా వస్తే నెట్టి పాడేశాడు. అంతకు ముందు ఒక అభిమాని సెల్ఫీ తీసుకుంటాను అంటూ దగ్గరకు వస్తే ఫోన్‌ లాగేసుకున్నాడు.
ఇలా బాలకృష్ణ సోషల్‌ మీడియాలో వివాదాలతో చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా బాలయ్య పద్దతిలో మాత్రం మార్పు వస్తున్నట్లుగా కనిపించడం లేదు. ప్రతి సారి ఏదో ఒక వివాదంను నెత్తిన మూట కట్టుకుంటున్నాడు.


నేడు బాలయ్య 102వ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆ సందర్బంగా బాలయ్య తన వ్యక్తిగత సిబ్బంది అయిన ఒక వ్యక్తిని తలపై ఒక్కటి వేశాడు. కాలికి ఉన్న చెప్పు సరి చేయమంటూ అతడిని కొట్టి మరీ చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చింది.
ఇలా జనాల్లో బాలకృష్ణ ఎన్నో సార్లు కొడుతూనే ఉన్నాడు. జనాలు ఉన్నప్పుడు కాస్త హద్దులో ఉండాలనే విషయాన్ని బాలయ్య ఇంకా ఎప్పుడు గుర్తిస్తాడో, ఆయనకు ఎప్పుడు బుద్ది వస్తుందో అని సినీ వర్గాల వారు మరియు సోషల్‌ మీడియా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.