News and Entertainment

ఐఎండీలో 1102 ఉద్యోగ వివరాలు


-డిగ్రీ/డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-మంచి జీతం.. భరోసా జీవితం
-నిత్యనూతనత్వం, చాలెంజింగ్ కెరీర్
-కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక

ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: ఐఎండీ భారత ప్రభుత్వ సంస్థ. అతిపురాతనమైన డిపార్ట్‌మెంట్. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో ఐఎండీ కార్యాలయాలు ఉన్నాయి.
-పోస్టు: సైంటిఫిక్ అసిస్టెంట్. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టు.
-పేస్కేల్: రూ. 9,300 – 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-ఖాళీల సంఖ్య – 1102
-వయస్సు: 2017, ఆగస్టు 4 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ డిగ్రీ/కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
నోట్: డిగ్రీ లేదా డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. 10+2 విధానంలో ఇంటర్ పూర్తిచేసిన తర్వాత డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-ఎంపిక: కంప్యూటర్‌బేస్డ్ ఎగ్జామ్ ద్వారా
-పరీక్ష తేదీలు: నవంబర్ 20-27 మధ్య నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
-200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-200 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
-ప్రశ్నపత్రం పార్ట్ – 1, 2లుగా ఉంటుంది.
-పార్ట్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్-25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్-25, జనరల్ అవేర్‌నెస్- 25 మార్కులు.
-పార్ట్ 2లో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లపై ప్రశ్నలు ఇస్తారు. (ఎన్నుకొన్న సబ్జెక్టు)
-పార్ట్- 2లో ప్రశ్నల సంఖ్య 100
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 4, ఫీజు: రూ. 100/-
నోట్: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ సదరన్ రీజియన్ కార్యాలయం