News and Entertainment

రేపు రవితేజను అరెస్ట్‌ చేస్తారు.. ఎందుకంటే?


డ్రగ్స్‌ కేసులో మాస్‌ హీరో రవితేజ సిట్‌ నుండి నోటీసులు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే నోటీసులు అందుకున్న దాదాపు అంతా కూడా ఒక్కరొక్కరు చొప్పున విచారణకు హాజరు అవుతున్నారు. రేపు రవితేజ సిట్‌ ముందుకు వెళ్లబోతున్నాడు. సిట్‌ అధికారులు రవితేజను ప్రశ్నించేందుకు సిద్దం అయ్యారు.
నేడు ముమైత్‌ ఖాన్‌ను ప్రశ్నిస్తున్న రవితేజను కాస్త సీరియస్‌గానే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి రవితేజకు మేనేజర్‌ అని తెలుస్తోంది.

ఆయన నుండి సేకరించిన వివరాల ప్రకారం రవితేజ డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు పలువురికి స్వయంగా డ్రగ్స్‌ను ఇచ్చాడు అని వెళ్లడైంది. మేనేజర్‌ సాయంతో రవితేజ డ్రగ్స్‌ వ్యాపారం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రవితేజ చిక్కులో ఇరుక్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు విచారణకు హాజరు అయ్యే రవితేజను అక్కడే అరెస్ట్‌ చేస్తారనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.
మేనేజర్‌ ఇచ్చిన వాంగ్మూలం మరియు ఇతరత్ర ఆధారాలను చూపించి రవితేజను అరెస్ట్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. అందుకే రేపు సిట్‌ ముందుకు వెళ్లేందుకు రవితేజ తీవ్ర మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక రెండు రోజులుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.