News and Entertainment

జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ ఫ్రీ మొబైల్‌??

ఎయిర్‌టెల్‌ గత పది సంవత్సరాలుగా ఇండియా టెలికాం రంగంలో రారాజుగా వెలుగు వెలిగింది. అయితే జియో ఎంట్రీతో ఎయిర్‌టెల్‌ లాభాల మాయమై నష్టాలు మొదలయ్యాయి. దాంతో ఎయిర్‌టెల్‌ నష్టనివారణ చర్యలు చేపట్టాయి. ఎంత ప్రయత్నం చేసినా కూడా జియో పోటీని తట్టుకోవడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది.

దానికి తోడు జియో తాజాగా ఫ్రీ ఫోన్‌ అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌పై పిడుగు పడ్డట్లయ్యింది. ఫ్రీ మొబైల్‌తో ఇతర టెలికాం సంస్థలు అన్ని కూడా సర్దేసుకోవాలనే టాక్‌ వినిపిస్తుంది.

ఈ సమయంలోనే ఎయిర్‌టెల్‌ ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇండియన్‌ మొబైల్‌ సంస్థలతో ఎయిర్‌టెల్‌ చర్చలు జరుపుతుంది. తక్కువ మొత్తాలకు ఎయిర్‌టెల్‌ సదరు సంస్థల నుండి మొబైల్స్‌ను తీసుకునేందుకు సిద్దం అవుతుంది. ఆ ఫోన్‌ను తమ వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని, సంవత్సరం పాటు కంటిన్యూగా నెలకు 100 రూపాయల రీచార్జ్‌ చేయాల్సి ఉంటుందట.

అలా వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు ఎయిర్‌టెల్‌ కొత్త ఎత్తుగడ వేసింది. మరి ఈ కొత్త ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా, జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ నిలిచేనా అనేది చూడాలి.