News and Entertainment

డెలివరీ తరువాత ఎన్నిరోజులు సెక్స్ చేకూడదు?

loading...

ప్రెగ్నెన్సి సమయంలో భార్యభర్తలు లైంగికంగా కలవకపోవడమే మంచిది అని మనం ఇప్పటికే చదువుకున్నాం. అలాగే ప్రెగ్నెన్సి తరువాత మరోసారి గర్భం దాల్చడానికి (ముఖ్యంగా సిజేరియన్ తరువాత) ఎంత సమయం తీసుకోవాలో కూడా చూసాం. మరి డెలివరీ తరువాత ఎన్నిరోజులు శృంగారానికి దూరంగా ఉండాలి?

డెలివరీ తరువాత భాగస్వాములు ఓపిగ్గా ఉండటం చాలా అవసరం. అప్పటికి, శృంగారంలో పాల్గొనక కనీసం 8-9 నెలలు గడవటంతో, ఇలాంటి సమయంలో ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే డెలివరీ తరువాత స్త్రీ శరీరంలో చాలావరకు టిష్యూలు చిరిగిపోయి ఉంటాయి. సిజేరియన్ అయింటే గాట్లు, గాయాలు ఉంటాయి. యూటేరస్ లో కూడా డెలివరీ వలన గాయలు ఉండొచ్చు. కాబట్టి, బ్లడ్ వెజిల్స్ కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో స్త్రీ శరీరానికి కవాల్సింది విశ్రాంతి, శృంగారం కాదు.

అందుకే డెలివరీ తరువాత 6 వారాల వరకు శృంగారంలో పాల్గొనకూడదు అని డాకర్లు చెబుతున్నారు. కాని అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు కాబట్టి, ప్రతీ స్త్రీ ఈ ఆరువారాలు సెక్స్ కి దూరంగా ఉండాల్సిందే అని చెప్పలేం. కొందరు 3-4 వారాల్లోనే కోలుకోవచ్చు. మరికొందరు 7-8 వారాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి, రిస్క్ తీసుకోకుండా, డెలివరీ తరువాత మరో రెండు నెలలు ఆ పని మొదలుపెట్టకపోతేనే మంచిదేమో.

Read: ప్రెగ్నెన్సి సమయంలో సెక్స్ సురక్షితమేనా?