News and Entertainment

న‌గ్నంగా న‌టిస్తే..ప్రోత్స‌హించిన కుటుంబ‌స‌భ్యులు


పెళ్లాం, పిల్ల‌లున్న వ్య‌క్తి..అందులోనూ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పేరున్న హీరో శ్రీకాంత్ న‌గ్నంగా తిరుగుతుంటే..ఎవ‌రైనా ఊరుకుంటారా? అస్స‌లు ఊరుకోరు. కుటుంబ స‌భ్యులైతే త‌మ ప‌రువు బ‌జారున ప‌డేస్తున్న హీరోగారిపై అగ్గిమీద గుగ్గిల‌మైపోతారు. ఇంటి పెద్ద‌లాంటి వ్య‌క్తి వంటిమీద ష‌ర్ట్ లేకుండా వుంటేనే కుటుంబ‌స‌భ్యులు తిడ‌తారు..! అటువంటిది నూలుపోగు లేకుండా న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గా తిరుగుతుంటే ఎవ‌రు ఊరుకుంటారు చెప్పండి? కానీ శ్రీకాంత్ న‌గ్నంగా న‌డిచి వెళ్తుంటే.. అది చూసిన కుటుంబ‌స‌భ్యులు ప్రోత్స‌హించార‌ట‌. మెచ్చుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పాడు.

ఓ మీడియా ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హీరో శ్రీకాంత్ తాను న‌గ్నంగా న‌టించిన సంద‌ర్భం, త‌రువాత కుటుంబ‌స‌భ్యుల స్పంద‌న‌పై వివ‌రాలు వెల్ల‌డించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ న్యూడ్‌గా న‌టించారు. అప్పట్లో ఇది తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా శ్రీకాంత్‌కు ఎంత పేరు తెచ్చిందో అంత వివాదాస్ప‌దంగా కూడా మారింది.

న్యూడ్‌గా రోడ్డుపై న‌డిచి వెళ్ల‌డం సాధ్య‌మేనా అని అనిపించినా ..షూటింగ్ ప్రారంభ‌మ‌య్యాక‌..అందులో ఇన్వాల్వ్ అయ్యేస‌రికి పూర్తిగా బిడియం పోయింద‌ని చెప్పాడు శ్రీకాంత్‌. న‌గ్నంగా రోడ్డుపై వెళ్తున్న స‌న్నివేశం సినిమాలో చూస్తే..అస‌భ్య‌తగా క‌నిపించ‌కుండా..సినిమా క‌థాంశానికి అనుగుణంగా వున్న‌ట్టు ప్ర‌తి ఒక్క‌రూ ఫీల‌య్యార‌ని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. న‌గ్నంగా న‌టించిన స‌న్నివేశం చూసి ఇంట్లో వాళ్లు కూడా మెచ్చుకోవ‌డం త‌న‌కు గొప్ప‌గా అనిపించింద‌ని ఆ నాటి సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నారు.