News and Entertainment

శివరాత్రి రోజు ఇలా చేస్తే పరమ దరిద్రం


శివం అంటే కళ్యాణం, శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం అని అర్థం. అయితే శివరాత్రి రోజున మనం చేసే కొన్ని పొరపాట్లు శివానుగ్రహం మనకు లభించకుండా అడ్డుపడతాయని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో లేదా దేవాలయంలో శివ లింగానికి అభిషేకం చేసేప్పుడు శరీరం నుంచి చెమట చుక్కలు శివుడి మీద లేదా శివ లింగం మీద ఎట్టి పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున అలా జరిగిందో పూర్వ జన్మలో పొందిన పుణ్యం కూడా వృథాగా పోతుంది. ఈ జన్మలో ఐశ్వర్యం అనుభవించకుండా నష్టం జరుగుతుంది. ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకూడదంటే..

శివుడికి జరిపే అర్చనలో మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడ కూడదు. ఇలా చేస్తే వంశ క్షయం జరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అంటే వంశం మొత్తం నాశనం అవుతుందని అర్థం. ఇక అతిముఖ్యమైన విషయం అభిషేకం చేసేప్పుడు పాల ప్యాకెట్ నుంచి శివలింగంపై నొక్క పోయ కూడదు.. పాలు, పెరుగు, చక్కెర ఒక పాత్రలోకి తీసుకుని చక్కగా పోయాలి. ఇలా కాకుండా ప్యాకెట్ తో అలాగే పోస్తే పుణ్యం కంటే పాపమే ఎక్కువగా వస్తుందిది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్యాకెట్లతో అభిషేకించరాదు. మరిన్ని వివరాలకు కింది వీడియోను చూడండి..