News and Entertainment

వేలంటైన్స్ డే నాడు రెచ్చిపోయిన ర‌వి శ్రీముఖి?


వేలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్స‌వం. మ‌రి ర‌వి, శ్రీముఖి ఎందుకు ఇంత‌గా రెచ్చిపోయారు? ఇద్ద‌రూ క‌లిసి ఓ షో చేస్తున్నారు. ఆ షో కూడా మాంచి రేటింగ్‌లో వుంది. ర‌వికి ధీటుగా శ్రీముఖి కూడా స్పందిస్తూ మాంచి కెమిస్ర్టీ పండిస్తోంది. ఇంత‌వ‌ర‌కూ ఓకే..కానీ వీళ్లిద్ద‌రూ ప్రేమికుల రోజును ఎందుకు జ‌రుపుకున్నారంటేనే అనుమానాలు వ‌స్తున్నాయి. వేలంటైన్స్ డే స్పెష‌ల్ ఎపిసోడ్‌లో ఇద్ద‌రూ రెచ్చిపోయారు.

ఈ వ‌ర్షం సాక్షిగా అంటూ ఆడుతూ పాడుతూ త‌మ‌ను తామే మైమ‌రిచిపోయార‌ని లేటెస్ట్ ప‌టాస్ షో చూసిన ఎవ‌రికైనా అనుమానం వ‌స్తుంది. ఇది వ‌ర‌కే ర‌వి శ్రీముఖి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ చాలా రోజుల నుంచీ రూమ‌ర్లున్నాయి. ర‌వికి లింకు పెడుతూ వ‌స్తున్న గాసిప్స్‌ను త‌ట్టుకోలేక లాస్య షో నుంచి త‌ప్పుకుంది. ఆ త‌రువాత ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ర‌వితో మాంచి టైమింగ్ మెయింటెన్ చేస్తోంది. ఇద్ద‌రూ ఇది ఒక ప‌బ్లిక్ షో అనేది మ‌రిచిపోయి..బూతులతో షోని నింపేస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

చివ‌రికి శ్రీముఖి, ర‌విల తెగింపు చూసి..షోకు వ‌స్తున్న స్టూడెంట్స్ కూడా షాక్ తింటున్నార‌ట‌. తానొక అమ్మాయిన‌నే స్పృహ లేకుండా శ్రీముఖి మ‌గాళ్ల కంటే బీభ‌త్స‌మైన బూతుల‌తో ర‌వికి కౌంట‌ర్ ఎటాక్ ఇస్తోంద‌ట‌. ఇదంతా షోని ర‌క్తి క‌ట్టించేందుకే అనుకున్నా.. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఇద్ద‌రూ నిజ‌మైన ప్రేమికుల కంటే ఎక్కువగా స్పందించార‌ట‌. ఈ వ‌ర్షం సాక్షిగా అంటూ ఒక‌రికొక‌రు హ‌త్తుకుపోవ‌డం చూసి..వీరి మ‌ధ్య కెమిస్ర్టీయే కాదు…ఫిజిక్స్ ..మేథ్స్ కూడా వ‌ర్క‌వుట్ అవుతోంద‌ని జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.