News and Entertainment

వాలెంటైన్స్ డే స్పెషల్: మీ రాశిని బట్టి మీ లవర్ కి ఎలాంటి గిప్ట్ ఇవ్వాలో తెలుసా..!

loading...


వాలెంటైన్స్ డే కి తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను మీటగలిగే అపూరూపమైన బహుమతులను ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే మీ లవర్ మనసులో స్థానం కోసం ఏయే రాశివారు ఎటువంటి బహుమతులను ఇవ్వాలన్న దానిపై జ్యోతిష్య శాస్త్రం చేస్తున్న కొన్ని సూచనలు.

మేష రాశి
మేష రాశికి చెందినవారు ధైర్యవంతులు, చురుకైనవారుగానూ ఉంటారు. దేన్నైనా ప్రేమించే మనస్తత్వం కలిగినవారై ఉంటారు కనుక వీరికి ఇచ్చే బహుమతులు విషయంలో కాస్త వెసులుబాటు ఉన్నదనే చెప్పుకోవచ్చు. అమ్మాయిల విషయానికి వస్తే… మంచి హ్యాండ్ బ్యాగులు, హెయిర్ అలంకరణలు, కళ్లద్దాలు, బెల్టులు వంటి బహుమతులతో సంతృప్తిపరచవచ్చు. ఎరుపు రంగు రోజాపూలు, మత్తెక్కించే సువాసనల అత్తరులు చాలా చాలా ఇష్టపడతారు. కనుక అటువంటి వాటితో మేష రాశి అమ్మాయిలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీడియో గేములు, సినిమా లేదా పాటల డీవీడీలు, సీడీలు, తాజా సినిమాలకు సంబంధించి టిక్కెట్లు కొని సినిమాకు చెక్కేద్దామంటే ఎగిరి గంతేస్తారు.

వృషభరాశి
ఈ రాశికి చెందినవారు చాలా నెమ్మదస్తులు. ఉన్నతమైన వస్తువులంటే వారికి ఎనలేని ప్రీతి. ఖరీదైన వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ. లగ్జరీ ఐటమ్ ఏదైనా వారికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. వృషభరాశికి చెందిన అమ్మాయిలు ధగధగలాడే కంఠాభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవికాకపోయినా బ్రాస్లెట్స్, గాజులు వంటివి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంకా అందమైన దుస్తులను ఇవ్వడం ద్వారా కూడా వీరిని తృప్తిపరచవచ్చు.