News and Entertainment

5 నిమిషాలు ఇక్కడ ప్రెస్ చేస్తే.. ఏం జరుగుతుందో మీ ఊహకు అందని వైధ్యం.!

loading...

ఈ మధ్యకాలంలో మలబద్దకం సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. వేళకు భోజనం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,జంక్ ఫుడ్ తినడం వలన మలబద్దకం సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్య ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. అయితే కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే ఇక‌పై మిమ్మ‌ల్ని మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య బాధించదు. సుఖంగా విరేచ‌నం అవుతుంది. బాత్‌రూంకు వెళ్లిన 5 నిమిషాల లోపే మీ ప‌ని పూర్త‌యిపోతుంది. ఆ టిప్ ఏమిటంటే…

ఆక్యుప్రెష‌ర్ వైద్యం గురించి తెలుసు క‌దా. శ‌రీరంలో ఉన్న నిర్దిష్ట‌మైన భాగాల్లో కొంత‌సేపు ఒత్తిడి క‌లిగించ‌డం ద్వారా ఆయా అవ‌య‌వాల‌కు చెందిన స‌మ‌స్య‌ల‌ను ఇట్టే తొల‌గింవ‌చ్చు. అయితే ఇదే ఆక్యుప్రెష‌ర్ వైద్యం సుఖ విరేచ‌నం అవ‌డం కోసం కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదెలాగంటే… ఆక్యుప్రెష‌ర్ వైద్యం చెబుతున్న ప్ర‌కారం… మ‌న శ‌రీరంలో బొడ్డు కిందుగా సీ ఆఫ్ ఎన‌ర్జీ (sea of energy) అనే ఓ పాయింట్ ఉంటుంది. దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఒత్తిడి క‌లిగిస్తే చాలు, విరేచ‌నం సుల‌భంగా అవుతుంది. అయితే ఆ పాయింట్‌ను ఎలా గుర్తించాలంటే…

స‌రిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్ల‌ను అడ్డంగా పెట్టి కొల‌వండి. వాటి కింద వ‌చ్చే పాయింట్ నే సీ ఆఫ్ ఎన‌ర్జీ పాయింట్ అని అంటారు. దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషాం పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేయండి. కొద్దిగా ఒత్తిడి క‌లిగించండి. దీంతో విరేచ‌నం వెంట‌నే వ‌చ్చేస్తుంది. 5 నిమిషాల్లోపే కాల‌కృత్యాలు తీర్చేసుకుంటారు కూడా. అంతేకాదు, ఇలా చేయ‌డం వ‌ల్ల పెద్ద పేగులో ఉన్న వ్య‌ర్థాలు కూడా వెంట‌నే బ‌య‌ట‌కు వ‌స్తాయి. స్త్రీల‌లో అయితే రుతు స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గిపోతాయి. ఇత‌రుల‌కు గ్యాస్ స‌మ‌స్య‌లు కూడా తీరుతాయి. అయితే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం, స‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటించ‌డం, వేళ‌కు భోజ‌నం చేయడం చేస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య మిమ్మ‌ల్ని బాధించ‌దు.